ఎట్టకేలకు తన కారుకు రూ.40 లక్షల పన్ను చెల్లించిన కోలీవుడ్ హీరో విజయ్
- విదేశాల నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి
- 2012లో పన్నుమినహాయింపు కోరిన విజయ్
- విజయ్ కి అక్షింతలు వేసిన మద్రాస్ హైకోర్టు
- లక్ష జరిమానా కట్టాలంటూ ఆదేశాలు
విదేశీ కారు కొనుగోలు చేసి పన్ను చెల్లించకపోవడం పట్ల కోర్టుతో అక్షింతలు వేయించుకున్న తమిళ హీరో విజయ్ ఎట్టకేలకు పన్ను చెల్లించాడు. తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు సంబంధించి రూ.40 లక్షల పన్ను చెల్లించాడు. విజయ్ ప్రభుత్వానికి పన్ను చెల్లించిన విషయాన్ని రాష్ట్ర అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలియజేశారు.
విజయ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇటీవల మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల జరిమానా కట్టాలని, ఆ మొత్తాన్ని తమిళనాడు సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరిమానాతో పాటు, కారుకు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.40 లక్షలను కూడా విజయ్ చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు నివేదించాయి.