టీజర్ ను రెడీ చేస్తున్న 'వలిమై'
- అజిత్ తాజా చిత్రంగా రూపొందిన 'వలిమై'
- ప్రతినాయక పాత్రలో కార్తికేయ
- సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
అజిత్ కి తమిళనాట విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటేనే అక్కడ హడావిడి మొదలవుతుంది. ఆయన సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. అలాంటి అజిత్ తాజా చిత్రంగా 'వలిమై' రూపొందింది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాకి, వినోద్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాలో అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించగా, ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ పోస్టర్ కీ .. ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేడో .. రేపో టీజర్ ను వదలనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. టీజర్ తోనే ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.