తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యం కానున్న 'భారత్' రిజిస్ట్రేషన్
- 'బీహెచ్' రిజిస్ట్రేషన్ విధానం తీసుకువచ్చిన కేంద్రం
- సెప్టెంబరు 15 నుంచి అమలు
- అమలుకు ఓకే చెప్పని ఏపీ, తెలంగాణ
- 'బీహెచ్' రిజిస్ట్రేషన్ లో తక్కువ పన్నులు
- ఏపీ, తెలంగాణ పన్నుల విధానంలో వ్యత్యాసం
ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు మరో రాష్ట్రంలో పన్నులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలు లేకుండా చేసేందుకు కేంద్రం 'భారత్' (బీహెచ్) పేరిట ప్రత్యేక రిజిస్ట్రేషన్ విధానం రూపొందించింది. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఏపీ, తెలంగాణలో మాత్రం 'బీహెచ్' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కానుంది. తెలుగు రాష్ట్రాల పన్నుల విధానంలో వ్యత్యాసం అధికంగా ఉండడమే అందుకు కారణం.
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలోకి ఏపీ, తెలంగాణలోనే వాహనాల లైఫ్ ట్యాక్స్ అధికంగా ఉంది. ఏపీకి ఈ లైఫ్ ట్యాక్స్ రూపంలోనే ఏటా రూ.4 వేల కోట్లు వస్తుండగా, తెలంగాణకు రూ.3,500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే 'బీహెచ్' విధానంలో కేంద్రం నిర్దేశించిన పన్నులు తెలుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నుల కంటే తక్కువగా ఉన్నాయి. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై తెలుగు రాష్ట్రాల రవాణా శాఖలు ఆలోచనలో పడ్డాయి.