'రాజు చచ్చాడు.. న్యాయం జ‌రిగింది' అంటోన్న నెటిజ‌న్లు.. 'దేవుడున్నాడు' అంటూ మంచు మ‌నోజ్ స్పంద‌న‌

  • రాజు మృతిపై నెటిజ‌న్ల హ‌ర్షం
  • దిక్కులేని చావు చ‌చ్చాడంటూ ఆగ్ర‌హం
  • కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మ‌నోజ్‌
హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలిక అఘాయిత్యానికి పాల్ప‌డి ఏడు రోజులుగా క‌న‌ప‌డ‌కుండా పోయిన‌ నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ సినీన‌టుడు మంచు మ‌నోజ్ స్పందించాడు.

'ఈ వార్త చెప్పినందుకు థ్యాంక్యూ స‌ర్.. దేవుడు ఉన్నాడు' అంటూ మంచు మ‌నోజ్ స్పందించారు. కాగా, రాజు ఆత్మ‌హ‌త్య‌పై సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు. నిందితుడు రాజు దిక్కులేని చావు చ‌చ్చాడ‌ని నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు. 'రాజు చచ్చాడు.. న్యాయం జ‌రిగింది' అంటూ పలువురు ట్వీట్లు చేశారు.

మ‌రోవైపు, తెలంగాణ ఐద్వా జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ  మ‌ల్లు లక్ష్మి నిందితుడు రాజు మృతిపై స్పందిస్తూ... బాలిక‌ల‌పై అత్యాచారాలు వంటి దారుణ ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని అన్నారు. తెలంగాణ‌లో బాలిక‌ల‌పై దారుణాలు త‌రుచూ జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. మ‌ద్యం దుకాణాలు బంద్ చేయాల‌ని ఆమె అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఆ ప‌ని చేశార‌ని, దీంతో ఆ స‌మ‌యంలో దారుణాలు త‌గ్గాయ‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోతే ప్ర‌భుత్వాలు ఎందుక‌ని ఆమె నిల‌దీశారు.


More Telugu News