బ్లాక్ టైగర్స్ గుట్టు విప్పిన బెంగళూరు శాస్త్రవేత్తలు

  • ఒడిశాలోని సిమిలాపాల్‌లో అరుదైన బ్లాక్ టైగర్స్
  • దేశంలో మిగిలున్నవి 8 మాత్రమే
  • జన్యు ఉత్పరివర్తనం కారణంగానే నల్లటి చారలు వచ్చాయని గుర్తింపు
దేశంలోని ఒడిశాలో కనిపించే అరుదైన నల్లపులులకు (బ్లాక్ టైగర్) ఆ రంగు ఎలా వచ్చిందన్న గుట్టు వీడింది. ఒడిశాలోని సిమిలాపాల్‌లో కనిపించే బ్లాక్ టైగర్స్‌ శరీరంపై దట్టమైన నల్లటి చారలు కనిపిస్తాయి. దీంతో ఇవి మిగతా పులులకంటే భిన్నంగా కనిపిస్తాయి. అయితే, వాటికి నల్లటి రంగు ఎలా వచ్చిందన్న దానిపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

 తాజాగా, బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్) శాస్త్రవేత్తలు ఈ రంగు వెనకున్న గుట్టు విప్పారు. ‘ట్రాన్స్‌మెంబ్రైన్ అమినోపెప్టిడేస్ క్యూ’ అనే జన్యు ఉత్పరివర్తనం కారణంగానే వీటికి నలుపు రంగు వచ్చినట్టు గుర్తించారు. నిజానికి ఈ బ్లాక్ టైగర్లు ఇతర జాతుల పులులతో సంపర్కం జరపవు. కాబట్టి ఇవి అంతరించి పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో మొదలైంది. 2018 పులుల గణన ప్రకారం.. దేశంలో మొత్తం 2,967 పులులు ఉన్నాయి. వీటిలో 8 మాత్రమే నల్ల పులులు ఉన్నట్టు తేలింది.


More Telugu News