రాజ్‌కుంద్రాపై చార్జ్‌షీట్.. బ్లూ ఫిల్మ్స్‌తో పెద్ద ఎత్తున ఆర్జించాడన్న ముంబై పోలీసులు
- నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా
- 1500 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు
- మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్న పోలీసులు
నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (46)పై ముంబై పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. యువతులను వంచించి నీలి చిత్రాలు తీయడం ద్వారా రాజ్‌కుంద్రా అడ్డంగా ఆర్జించినట్టు కోర్టులో దాఖలు చేసిన 1500 పేజీల అనుబంధ చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్‌కుంద్రా, ఆయన సహచరుడు రేయాన్ థోర్పేలకు వ్యతిరేకంగా మేజిస్ట్రేట్ కోర్టులో క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
వీరు నిర్మించిన బ్లూ ఫిల్మ్స్‌ను యాప్‌ల ద్వారా మార్కెటింగ్ చేసుకునేవారని అందులో పేర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన యశ్ ఠాకూర్, లండన్‌కు చెందిన ప్రదీప్ బక్షి కూడా నిందితులుగా ఉన్నారని, వారిని అరెస్ట్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. కాగా, నిందితులు రాజ్‌కుంద్రా, థోర్పే జులై 19 నుంచి జుడీషియల్ కస్టడీలో ఉండగా, వీరి బెయిలు పిటిషన్ ముంబై సెషన్స్ కోర్టులో పెండింగులో ఉంది.