టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావశీలుర జాబితా.. తాలిబన్ నేత ముల్లా బరాదర్‌కు కూడా స్థానం!

  • ప్రపంచంలోని అత్యంత 100 మంది ప్రభావశీలుర జాబితాలో బరాదర్
  • జో బైడెన్, జిన్‌పింగ్ కేటగిరీలోనే బరాదర్ కూడా
  • మోదీ, మమత, అదర్ పునావాలాకూ చోటు
జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమైనా ఇది నిజం. టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావశీలుర జాబితా-2021లో తాలిబన్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు కూడా చోటు దక్కింది. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలురు (Time Magazine's 100 Most Influential People of 2021) జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కొవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు చోటు దక్కింది.

అలాగే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మర్కెల్ తదితరులకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ  కరుడుగట్టిన ఉగ్రవాది, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు కూడా టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కింది. బైడన్, జిన్‌పింగ్ ఉన్న కేటగిరీలోనే బరాదర్‌కు కూడా చోటు దక్కడం గమనార్హం.


More Telugu News