ఏపీ సీఎం జగన్‌తో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి భేటీ.. ఏపీ రాజకీయాలపై ఆరా!

  • ప్రత్యేక విమానంలో వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి
  • సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ
  • తిరుమలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ
బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే, ఏపీ రాజకీయాలపై సుబ్రహ్మణ్యస్వామి ఆరా తీసినట్టు సమాచారం. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రశంసించిన సుబ్రహ్మణ్యస్వామి.. టీటీడీపై అసత్య ప్రచారం జరుగుతోందంటూ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా, తాజా భేటీలోనూ తిరుమలకు సంబంధించి పలు కీలక విషయాలపై సీఎం, సుబ్రహ్మణ్యస్వామి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.


More Telugu News