మోదీజీ థాంక్యూ.. టెలికం రంగ సంస్కరణలపై స్పందించిన ముఖేశ్ అంబానీ
- టెలికం రంగంలో పలు సంస్కరణల ప్రకటన
- బాకీలపై నాలుగేళ్లు మారటోరియం అవకాశం
- డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనలో కీలక పాత్ర
- సాహసోపేతమైన నిర్ణయమన్న రిలయన్స్ అధినేత
టెలికం రంగంలో భారత ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రకటించింది. ఈ రంగంలోని కంపెనీల బాకీలపై నాలుగేళ్లు మారటోరియం అవకాశం కూడా కల్పించింది. ఈ సంస్కరణలపై రిలయన్స్ సంస్థల అధినేత, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ స్పందించారు.
ఈ సంస్కరణలు డిజిటల్ ఇండియా లక్ష్యాలు సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు. డిజిటల్ భారత్ పథకం కింద పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ కొత్త సంస్కరణలు చాలా దోహదపడతాయని ముఖేశ్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’ అని ముఖేశ్ పేర్కొన్నారు.