కరోనాను నిలువరించడానికి 6 అడుగుల దూరం చాలదు!

  • అమెరికాలో జరిగిన అధ్యయనంలో వెల్లడి
  • ఆఫీసుల కన్నా ఇళ్లలోనే కరోనా భయం ఎక్కువన్న పరిశోధన
  • వైరస్ వ్యాప్తిపై వెంటిలేషన్ ప్రభావం కూడా
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని బలిగొన్న కరోనాను నియంత్రించడం కోసం శాస్త్రవేత్తలు కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. వాటిలో మాస్కు ధరించడం, రెండు మీటర్ల దూరం పాటించడం ముఖ్యమైనవి. అయితే ఇలా రెండు మీటర్ల సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాప్తిని నిలువరించడం కష్టమని తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

ఈ పరిశోధన ప్రకారం కరోనా పేషెంట్ ఉన్న ఇంట్లో అతని నుంచి వైరస్ చాలా వేగంగా చుట్టుపక్కల వారిని చేరుతుంది. కరోనా పేషెంట్ల శ్వాస, వారు మాట్లాడినా ఈ వైరస్ క్రిములు కేవలం నిమిషంలోనే ఇతరులను చేరుకుంటాయి. అదే ఆ ఇంట్లో వెంటిలేషన్ సదుపాయాలు సరిగా లేకపోతే ఈ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.

గాలి ద్వారా కరోనా సోకే ప్రమాదం ఆఫీసుల్లో కన్నా ఇళ్లలోనే ఎక్కువగా ఉందన్నది తమ పరిశోధనలో బయటపడిన షాకింగ్ అంశమని పరిశోధకులు తెలిపారు. అయితే సరైన వెంటిలేషన్ సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటే ఈ ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని వాళ్లు తెలిపారు. అలాగే వెంటిలేషన్, దూరం పాటించడం మాత్రమే కరోనా నుంచి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే సాధనాలని స్పష్టంచేశారు.


More Telugu News