దసరా బరిలోకి 'దృశ్యం 2'?

దసరా బరిలోకి 'దృశ్యం 2'?
  • దసరా బరి నుంచి తప్పుకున్న 'ఆర్ ఆర్ ఆర్'
  • పండగకి 'అఖండ' కూడా రానట్టే
  • 'దృశ్యం 2'ను రంగంలోకి దింపే ఆలోచన
  • త్వరలో రానున్న క్లారిటీ  
దసరా పండుగకు రావలసిన 'ఆర్ ఆర్ ఆర్' రాకపోవడంతో, చాలా సినిమాలు ఆ స్థానంలో రావడానికి ఆసక్తినీ .. ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' రావలసిన అక్టోబర్ 13వ తేదీన బాలకృష్ణ 'అఖండ' సినిమా విడుదలయ్యే అవకాశం ఉందంటూ ఒక టాక్ వచ్చింది.

కానీ అప్పటికీ 'అఖండ' సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యే అవకాశం లేదట. అందువలన దసరాకి 'అఖండ' రావడం లేదనే విషయం తేలిపోయినట్టే. దాంతో ఆ తేదీన 'దృశ్యం 2' సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నారని చెప్పుకుంటున్నారు.

అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన నాయికగా మీనా నటించింది. మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2'కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.


More Telugu News