ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో బంపర్ ఆఫర్
- పండుగల సీజన్‌లో ఈ-కామర్స్ సంస్థ ప్రకటన
- మరింత మందికి పే-లేటర్ ఛాన్స్
- పరిమితి కూడా రూ.70వేల వరకూ పెంపు
ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. వస్తువులు ముందుగా కొనుక్కొని, ఆ తర్వాతి నెలలో డబ్బులు చెల్లించే ‘పే-లేటర్’ ఆప్షన్‌ను మరింత మంది వినియోగదార్లకు అందించేందుకు సిద్ధమైంది.
ఇప్పటి వరకూ ఈ ఆప్షన్‌ను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 10కోట్ల మంది యూజర్లకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. ఈ ఆప్షన్ కావాలని అనుకునే వారు.. తమ ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ కొత్త ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
ఇప్పటి వరకూ పే-లేటర్ ఆప్షన్ ఉన్న వారు కూడా కేవలం రూ.10 వేల విలువైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసే వీలుండేది. అయితే ఈ పరిమితిని రూ.70 వేలకు పెంచాలని ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ ఆఫర్‌లో ఈఎంఐ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది.
అంటే పే-లేటర్‌లో ఖర్చు చేసిన మొత్తాన్ని వెసులుబాటును బట్టి ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ గురించి తెలిసిన యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్‌లో తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.