ఆఫ్ఘ‌న్ కేంద్రంగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు జ‌ర‌గ‌నివ్వం: తాలిబ‌న్లు

  • మీడియాకు తెలిపిన‌ విదేశాంగ మంత్రి మొలావీ 
  • ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా ఆఫ్ఘ‌న్‌ను మార‌నివ్వం
  • అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదు
ఆఫ్ఘ‌నిస్థాన్ అంతా తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఆ దేశం కేంద్రంగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై తాలిబన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్‌ ఖాన్‌ ముత్తఖి స్పందిస్తూ.. అటువంటివేమీ జ‌ర‌గ‌బోవ‌ని స్పష్టం చేశారు. త‌మ దేశాన్ని ఉగ్రశిబిరాలకు కేంద్రంగా మారనివ్వబోమని చెప్పారు.  

అలాగే, ఆఫ్ఘ‌న్‌లో మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తారా? అన్న విష‌యాల‌నూ ఆయ‌న తెల‌పలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వ‌హిస్తారా? అన్న విష‌యంపై ఆయ‌న‌ను మీడియా ప్ర‌శ్నించింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. త‌మ‌ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదని దాట‌వేశారు. కాగా, అల్‌ఖైదా వంటి ఉగ్ర సంస్థలతో స‌త్సంబంధాలు పెట్టుకోకూడదన్న విషయంపై అమెరికాతో చర్చల సందర్భంగా గ‌త ఏడాది తాలిబన్లు ఒప్పందం చేసుకున్నారు.


More Telugu News