హిందువులు ప్రపంచంలోనే అత్యంత సహనపరులు .. దేశం మరో ఆఫ్ఘనిస్థాన్ కాబోదు: జావేద్ అక్తర్
- భారతీయులు తీవ్రవాదులు కాదు
- ఆఫ్ఘన్ లో తాలిబన్ల ఇస్లాం రాజ్యస్థాపన
- ఇక్కడ హిందూ రాజ్యం అంటున్న హిందూత్వ సంస్థలు
- శివసేన పత్రిక సామ్నాలో వ్యాసం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ)లను తాలిబన్లతో పోల్చిన బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్.. తాజాగా హిందువులు అత్యంత సహనపరులంటూ వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్, వీహెచ్ పీల మీద జావేద్ అక్తర్ వ్యాఖ్యల పట్ల శివసేన ఫైర్ అవడంతో.. ఆ పార్టీ పత్రికలోనే తాజాగా ఆయన ఓ సంపాదకీయం రాశారు.
ఆ వ్యాసంలో హిందువులు చాలా మంచివారని, ప్రపంచంలోనే అత్యంత సహనపరులని ఆయన రాసుకొచ్చారు. ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉండే భారత్ ఎప్పుడూ ఆఫ్ఘనిస్థాన్ కాబోదని అన్నారు. భారతీయులు స్వతహాగా తీవ్రవాదులు కాదన్నారు. మధ్యస్థంగా ఉండడం భారతీయుల డీఎన్ఏల్లోనే ఉందని చెప్పుకొచ్చారు.
హిందూత్వ సంస్థలను తాలిబన్లతో పోల్చడం పట్ల కొందరు తనపై కోపంగా ఉన్నారన్నారు. ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఇస్లాం రాజ్య స్థాపన చేస్తుంటే.. ఇక్కడ హిందూత్వ సంస్థలేమో హిందూ రాజ్య స్థాపన అంటున్నాయని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారని, ఇక్కడ హిందూత్వ సంస్థలు కూడా మహిళలకు స్వేచ్ఛనివ్వబోమంటూ చెబుతున్నాయని అన్నారు.