స్టేడియంలో మ్యాచ్ చూస్తుండగా పైనుంచి జారి పడిన పిల్లి.. చేతిలో జెండాతో కాపాడిన ఫ్యాన్స్
- మియామీలో జరిగిన కాలేజ్ ఫుట్‌బాల్ మ్యాచ్
- స్టేడియం బాల్కనీ నుంచి కింద పడిన పిల్లి
- అమెరికా జెండాతో కాపాడిన అభిమానులు
- నెట్టింట్లో వీడియో వైరల్
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గాల్లో ఊపడానికి తీసుకెళ్లిన జెండా.. ఒక ప్రాణం కాపాడటంలో ఉపయోగపడింది. అమెరికాలోని మియామీలో హార్డ్ రాక్ స్టేడియం ఉంది. ఇక్కడ శనివారం నాడు ఒక కాలేజ్ స్థాయి ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఇది చూడటం కోసం క్రెగ్ క్రామర్, కింబర్లీ క్రామర్ అనే దంపతులు కూడా వెళ్లారు. వారితోపాటు అమెరికా జెండా కూడా తీసుకెళ్లారు.
మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా తలెత్తి పైకి చూసిన వారికి.. బాల్కనీ నుంచి కింద పడుతున్న ఒక పిల్లి కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన ఈ దంపతులు.. పిల్లిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. తమ చేతిలోని జెండాను పిల్లి కింద పడే ప్రదేశంలో వలలా పట్టుకున్నారు. వీరి చర్యలను గమనించిన చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులు కూడా వారికి సాయం చేశారు.
ఎలాగైనా పట్టు చిక్కించుకొని పైకి ఎక్కడం కోసం ప్రయత్నించిన పిల్లి.. చివరకు జారి కింద పడింది. ఆ సమయంలో కింద అమెరికా జెండాను జల్లెడలా పట్టుకోవడంతో అది బతికిపోయింది. పిల్లికి ఎటువంటి గాయాలూ కాలేదు. ఈ మొత్తం ఘటనను కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దీన్ని 70 లక్షలమందికిపైగా చూశారు. నెటిజన్లు స్టేడియంలో ప్రేక్షకులు చేసిన పనిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.