'నీట్' ఒత్తిడి భరించలేక... తమిళనాడులో మరో బలవన్మరణం

  • నీట్ కు ముందు ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య
  • దిగ్భ్రాంతికి లోనైన సీఎం స్టాలిన్
  • ఆ ఘటన మరువక ముందే మరో ఉదంతం
  • సోమవారం తనువు చాలించిన 17 ఏళ్ల విద్యార్థిని
జాతీయ వైద్య విద్య ప్రవేశాల పరీక్ష 'నీట్' ఒత్తిడి భరించలేక తమిళనాడులో ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఓ విద్యార్థిని బలవన్మరణం చెందింది. అరియలూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 'నీట్' పరీక్ష ముగిసిన మరుసటి రోజే 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడుకు 'నీట్' నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్టాలిన్ సర్కారు బిల్లు తీసుకువచ్చిన రోజే ఈ ఘటన జరిగింది.

అంతకుముందు, ధనుష్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దని, 'నీట్' కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

గతంలో తమిళనాడులో 'నీట్' పరీక్షను దాదాపు దశాబ్దకాలం పాటు రద్దు చేశారు. 'నీట్' కేవలం ధనిక కుటుంబాల విద్యార్థులకే సులభతరంగా ఉంటోందని, పేద విద్యార్థులు అంత ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తమిళ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లలో వైద్య విద్య ఆశావహులు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు.


More Telugu News