ఈ 13 హారర్ సినిమాలు చూస్తే.. 1300 డాలర్లు ఇస్తామంటున్న అమెరికా కంపెనీ!
- హారర్ ప్రియులకు అమెరికా కంపెనీ 'ఫైనాన్స్‌బజ్' ఆఫర్
- భయంపై బడ్జెట్ ప్రభావం తెలుసుకోవడానికి అధ్యయనం
- దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 26 ఆఖరి తేదీ
- ఇప్పటికే విడుదల చేసిన 13 సినిమాల జాబితా
మీరు హారర్ మూవీ ప్రియులా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకే.. అంటూ అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. తాము చెప్పిన 13 సినిమాలను 9 రోజుల వ్యవధిలో చూస్తే 1300 డాలర్లు అంటే మన లెక్కల్లో సుమారు రూ.95,800 బహుమతి ఇస్తామని ప్రకటించింది.
‘‘హారర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్’’ అని ఈ ఉద్యోగానికి పేరు పెట్టింది ఫైనాన్స్‌బజ్ అనే అమెరికా సంస్థ. హారర్ చిత్రాల్లో నాణ్యతపై సినిమా బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని అంచనా వేయడానికే ఈ అధ్యయనం చేస్తున్నారట. ఈ మేరకు ఫైనాన్స్ బజ్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది.
‘‘వాంటెడ్: తక్కువ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే, భారీ బడ్జెట్ హారర్ సినిమాలు ఎక్కువ భయం పుట్టిస్తాయా? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం 13 హారర్ చిత్రాలు చూడాలి. దీనికోసం మంచి హారర్ మూవీ ప్రియులు కావాలి’’ అంటూ సదరు సంస్థ ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వాళ్లు 18 సంవత్సరాలు నిండిన అమెరికా పౌరులు అయ్యుండాలి.
అలాగే సినిమాలు చూసిన తర్వాత వాటి బడ్జెట్‌ను అంచనా వేసి ఈ సినిమాలకు ర్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీకి దరఖాస్తులు స్వీకరించే ఆఖరి తేదీ ఈ నెల 26. అక్టోబరు 1న ఎంపికైన విజేతలను ప్రకటిస్తారు. వీరు వచ్చే నెల 9 నుంచి 18 వరకూ కంపెనీ ఎంపిక చేసిన 13 చిత్రాలను చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాలు చూసే సమయంలో వీరు ఫిట్‌బిట్ వాచ్ ధరించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఎంపిక చేసిన చిత్రాలివే..

- సా (SAW)
- అమిటీవిల్లె హారర్
- ఎ క్వయిట్ ప్లేస్
- ఎ క్వయిట్ ప్లేస్ పార్ట్ 2
- క్యాండీమ్యాన్
- ఇన్‌సైడియస్
- ది బ్లైర్ విచ్ ప్రాజెక్ట్
- సినిస్టర్
- గెట్ అవుట్
- ది పర్జ్
- హాలోవీన్ (2018)
- పారానార్మల్ యాక్టివిటీ
- అన్నబెల్లె