ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారమా... ఎంత దిగజారిపోయాం!: మహేశ్ బాబు ఆవేదన
- సైదాబాద్ లో కామోన్మాది ఘాతుకం
- ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
- ప్రాణాలు కోల్పోయిన బాలిక
- హృదయం భగ్గుమంటోందన్న మహేశ్ బాబు
- చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి
హైదరాబాదులో ఓ చిన్నారి అత్యాచారానికి గురై కన్నుమూసిన ఘటన పట్ల టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు చలించిపోయారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ అఘాయిత్యం మనం ఓ సమాజంగా ఏ స్థాయికి దిగజారిపోయామో చెప్పేందుకు నిదర్శనం వంటిదని వ్యాఖ్యానించారు.
"మన పిల్లలు ఎప్పటికైనా భద్రంగా ఉంటారా? అనేది ఓ జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. హృదయం భగ్గుమంటోంది... ఆ చిన్నారి కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తోందో ఊహించలేం" అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సత్వరమే చర్యలు తీసుకుని ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి అని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.