'నేనేనా?' నుంచి ఉత్కంఠను రేకెత్తిస్తున్న ట్రైలర్!

  • మిస్టరీ థ్రిల్లర్ గా 'నేనేనా?'
  • ప్రధానమైన పాత్రలో రెజీనా 
  • ముఖ్యమైన పాత్రలో అక్షర గౌడ 
  • తమిళ టైటిల్ గా 'సూర్పనగై'     
మొదటి నుంచి కూడా రెజీనా గ్లామరస్ పాత్రలను చేస్తూ వచ్చింది. ఆ తరువాత ఆమె చేసిన 'ఎవరు?' సినిమా చూసిన తరువాత, ఆమెలో గొప్పనటి ఉందనే విషయం చాలామందికి అర్థమైంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'నేనేనా?' రూపొందింది. రాజశేఖర వర్మ నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఒక మర్డర్ కేసు విచారణ .. 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఆ సంఘటన ఏమిటి? ఆ కేసును ఎలా ఛేదించారు? అనేదే కథ అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతంలోను .. గతంలోనూ రెజీనా వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ను తమిళంలో 'సూర్పనగై' పేరుతో విడుదల చేయనున్నారు. నాయిక ప్రధానమైన ఈ సినిమాతో రెజీనా మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి. 



More Telugu News