ప్రైవేటీకరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత అభివృద్ధి చెందుతుంది: జీవీఎల్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- ఇది విధానపరమైన నిర్ణయమన్న జీవీఎల్
- మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడి
- ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యక్రమంలో వ్యాఖ్యలు
ఏపీ పరిస్థితులపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కేంద్రం విధాన పరమైన నిర్ణయం అని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణతో స్టీల్ ప్లాంట్ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వల్ల మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. విశాఖ రైల్వే జోన్ వ్యవహారం క్రమంగా ఓ కొలిక్కి వస్తోందని జీవీఎల్ వెల్లడించారు. విజయనగరంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. 2018లో చేపట్టిన సర్వేలో విజయనగరం అత్యంత వెనుకబడిన జిల్లాగా తేలిందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
ఎందరో సాహితీవేత్తలు, కళాకారులు పుట్టినగడ్డ ఉత్తరాంధ్ర అని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇక్కడి కళాకారులు, రచయితలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రతి ఒక్కరూ నేతలను నిలదీయాలని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర భూకబ్జాల విషయంలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు.