ఏపీ అదనపు రుణాలు తీసుకోవచ్చు... కేంద్రం అనుమతి
- మూలధన వ్యయ లక్ష్యాలు చేరుకున్న 11 రాష్ట్రాలు
- వాటిలో ఏపీ కూడా ఒకటి
- ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రోత్సాహకం
- వేల కోట్ల సమీకరణకు మార్గం సుగమం
ఏపీ సర్కారు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఊరటనిచ్చింది. అదనపు రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఏపీ సర్కారుకు కీలక అనుమతులు మంజూరు చేసింది. మూలధన వ్యయం విషయంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్న 11 రాష్ట్రాలకు కేంద్రం ఈ అనుమతులు ఇవ్వగా, అందులో ఏపీ కూడా ఉంది.
ఈ ప్రోత్సాహకం ద్వారా ఏపీ రూ.2,665 కోట్లు సమీకరించుకోవచ్చు. మార్కెట్ నుంచి అదనంగా రూ.15,721 కోట్ల వరకు సమీకరించుకోవచ్చు. ఈ రుణాలను ఏపీ సర్కారు 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్వీకరించాల్సి ఉంటుంది.