హనుమకొండలో నిరాహార దీక్ష‌కు దిగిన వైఎస్ ష‌ర్మిల‌

  • హనుమకొండలో హయగ్రీవచారి మైదానం వ‌ద్ద దీక్ష‌
  • నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
  • పాల్గొన్న ప‌లువురు నిరుద్యోగులు
వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు షర్మిల ఈ రోజు హనుమకొండలో హయగ్రీవచారి మైదానం వ‌ద్ద   నిరుద్యోగ నిరాహార దీక్ష‌కు దిగారు. ప‌లువురు నిరుద్యోగులు ఈ దీక్ష‌లో పాల్గొన్నారు. అంతకు ముందు ఆమె కాక‌తీయ యూనివ‌ర్సి‌టీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళుల‌ర్పించారు.

నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఆమె చేప‌ట్టిన దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఆమె తెలంగాణ‌లో నిరుద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌తారు. ష‌ర్మిల దీక్ష‌కు దిగిన సంద‌ర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలిపారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేస్తున్నారు. అప్ప‌టివ‌ర‌కు తాను తెలంగాణ‌లో నిరుద్యోగుల కోసం పోరాడుతూనే ఉంటాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.


More Telugu News