అనేక కోణాల్లో నటుడు నవదీప్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు

  • డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ
  • నవదీప్ ను 9 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
  • ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ను కూడా ప్రశ్నించిన వైనం
  • కెల్విన్ తో సంబంధాలపై ఆరా
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణ ముగిసింది. టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ ను అనేక కోణాల్లో ప్రశ్నించారు. ముఖ్యంగా, డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో లావాదేవీలపైనే ఈడీ అధికారులు నవదీప్ ను ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర అంశాలపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.

నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ విక్రమ్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. హైదరాబాదులోని ఎఫ్ క్లబ్ మాదకద్రవ్యాల అడ్డాగా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ క్లబ్ నవదీప్ సొంత పబ్ అని తెలిసిందే.


More Telugu News