అమెరికా గ్రీన్ కార్డు ఆశావహులకు శుభవార్త!
- కొత్త విధానానికి రూపకల్పన
- ప్రస్తుతం బిల్లు దశలో ప్రతిపాదిత విధానం
- రుసుం చెల్లిస్తే గ్రీన్ కార్డు
- అనేకమంది భారతీయులకు లబ్ది
ఐటీ నిపుణులకు అమెరికా స్వర్గధామం వంటిది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు పుట్టినిల్లయిన అమెరికాలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలన్నది చాలామంది కల. అయితే, అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు తప్పనిసరి. హెచ్1బీ ఉద్యోగ వీసాలతో అమెరికా వచ్చిన వారు ఈ గ్రీన్ కార్డులు పొందాలంటే అది ఎంతో కష్టసాధ్యమైన వ్యవహారం. బ్యాక్ లాగ్ జాబితాలో పడితే గ్రీన్ కార్డు కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూడాలి.
ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభలో ఆసక్తికరమైన బిల్లును ప్రతిపాదించారు. దీని ప్రకారం బ్యాక్ లాగ్ లో పేరు ఉన్నవారు గ్రీన్ కార్డు పొందడం ఇకమీదట సులభతరం కానుంది. వారు నిర్దేశిత మొత్తాన్ని చెల్లిస్తే గ్రీన్ కార్డు జారీ చేస్తారు.
5 వేల డాలర్లు చెల్లిస్తే చాలు... రెండేళ్ల ముందే గ్రీన్ కార్డు అందుకునేలా ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. హెచ్1బీ వీసాదారులకు ఈ మొత్తం 5 వేల డాలర్లు కాగా, ఈబీ-5 వీసాదారులు 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ ఆధారిత వలసదారులకు ఈ రుసుంను 2,500 డాలర్లుగా పేర్కొన్నారు. గ్రీన్ కార్డు ప్రాధాన్య తేదీ రెండేళ్ల లోపు లేనివారు 1,500 డాలర్లు చెల్లించాలి.
అయితే, ప్రస్తుతం ఇది ప్రతిపాదిత బిల్లు రూపంలోనే ఉంది. ఈ వెసులుబాటు అమల్లోకి రావాలంటే బిల్లు చట్టంగా మారాల్సి ఉంటుంది. అందుకు ఎన్నో ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ అవకాశం అనేకమంది భారతీయ నిపుణులకు ప్రయోజనం కలిగించనుందని భావిస్తున్నారు.