తాలిబన్లతో పొంచి ఉన్న ముప్పు.. భద్రతాబలగాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
- జమ్మూకశ్మీర్ లో ఉగ్ర చర్యలకు తాలిబన్లు తెగబడే అవకాశం
- సైనికులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బోర్డర్ లోని ప్రతి సైనికుడికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం పట్ల పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందని... వారి ప్రేరణతో పలు దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర దేశాల విషయాల్లో కల్పించుకోబోమని తాలిబన్లు ప్రకటించినప్పటికీ... వారి మాటలను నమ్మే స్థితిలో ఎవరూ లేరు.
మరోవైపు, భారత్ కు కూడా తాలిబన్లతో ముప్పు పొంచి ఉంది. జమ్మూకశ్మీర్ లో తాలిబన్లు ఉగ్ర చర్యలకు తెగబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. తాలిబన్లను ఎదుర్కోవడానికి భద్రతాబలగాలకు అవసరమైన శిక్షణను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాలిబన్లు ఉగ్ర చర్యలకు పాల్పడితే వారిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా తరిమికొట్టాలి? ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి? అనే అంశాలపై సైనికులకు శిక్షణ ఇవ్వనున్నారు. సరిహద్దుల వద్ద ఉండే ప్రతి ఒక్క సైనికుడికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.