కోహ్లీ స్థానంలో టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ?
- టీ20 ప్రపంచ కప్ తర్వాత టెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
- కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ నిర్ణయం
- టెస్టు జట్టులో చోటుచేసుకోనున్న భారీ మార్పులు
టీమిండియాలో కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వ పగ్గాలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగబోతోంది. దీని తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనుంది.
ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ భారం కోహ్లీ ఆటతీరుపై పడుతోంది. దీంతో, ఒక ఫార్మాట్ నుంచి కోహ్లీకి ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. కోహ్లీని మళ్లీ మునుపటి ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో టెస్ట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.