విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మహా పాదయాత్ర.. విజయవంతం

  • గాజువాక నుంచి మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర
  • ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న మంత్రి
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిన్న నగరంలోని గాజువాకలో నిర్వహించిన మహాపాదయాత్రలో కార్మికులు కదం తొక్కారు. గాజువాక బీసీ రోడ్డు అంబేద్కర్ కూడలి నుంచి ప్రారంభమైన యాత్ర కొత్త గాజువాక, సినిమా హాలు కూడలి, పాతగాజువాక వరకు 3 కిలోమీటర్ల మేర కొనసాగింది.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ పాదయాత్రను ప్రారంభించారు. యాత్రలో పాల్గొన్న నిర్వాసితుల సంఘాలు, అఖిలపక్షాలు, ప్రజాసంఘాలు నినాదాలతో హోరెత్తించాయి. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించాయి.

సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.


More Telugu News