ఫుజియాన్ ప్రావిన్స్‌లో కొత్తగా 19 కరోనా కేసులు.. నగరం మొత్తాన్ని మూసేసిన చైనా

  • కేసులు వెలుగుచూడగానే కట్టుదిట్టమైన చర్యలు
  • రైళ్లు, బస్సులు సహా సమస్తం మూసివేత
  • బయటి వారు లోపలికి, నగరంలోని వారు బయటకు వెళ్లకుండా చర్యలు
కరోనా వైరస్ విషయంలో చైనా ఎంత అప్రమత్తంగా ఉంటుందో చెప్పేందుకు ఇది ఉదాహరణ. ఫుజియాన్ ప్రావిన్స్‌లో తాజాగా 19 కరోనా కేసులు బయటపడడంతో ఏకంగా నగరం మొత్తాన్ని మూసేసింది. బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాలు, బార్లు, జిమ్‌లు ఇలా ప్రతి ఒక్కదానిని మూసేశారు. స్థానికులు ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వారు ఎవరూ నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే గత 48 గంటల్లో చేయించుకున్న కరోనా నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.

నిజానికి చైనా గతేడాదే కరోనా వైరస్‌ను కట్టడి చేసింది. అయితే, డెల్టా వేరియంట్ కారణంగా అక్కడక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రష్యా, మయన్మార్ నుంచి వస్తున్న వారిలోనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఫుజియాన్‌లో కొత్త కేసులు వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ బృందాన్ని ఫుజియాన్‌కు పంపింది.


More Telugu News