మహిళల క్రికెట్ విషయంలో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు ఆసీస్ వార్నింగ్!
- ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల క్రికెట్‌ను నిషేధించిన తాలిబన్లు
- స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
- టెస్ట్ మ్యాచ్ రద్దు చేస్తామంటూ బెదిరింపు
- స్పందించిన ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్
ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఆస్ట్రేలియా వార్నింగ్‌కు తాలిబన్లు తలొంచుతారా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే వచ్చేలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలను అన్ని రంగాల్లో అణచివేస్తున్నారు.
ఈ క్రమంలోనే దేశంలో మహిళల క్రికెట్‌ను నిషేధించారు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రంగంలోకి దిగి ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ ఆడాలని, మహిళల అభివృద్ది కోసం తాము పాటు పడతామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెప్పింది. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ నుంచి తప్పుకుంటే నవంబర్‌లో జరగాల్సిన మెన్స్ టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తామని ఆఫ్ఘన్‌కు వార్నింగ్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తే ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని, త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ నుంచి ఆఫ్ఘన్‌ను తొలగించాలని ఆసీస్ టెస్ట్ టీమ్ కెప్టెన్ పైన్ ఐసీసీను డిమాండ్ చేశాడు. దీనిపై ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు స్పందించింది. తాలిబన్ల ప్రకటన కారణంగా తమ దేశ పురుషుల జట్టును శిక్షించడం సరికాదని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అజీజుల్లా ఫజ్లీ అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇంకా అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ ఎలా జరగుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని, ఆఫ్ఘనీ మహిళలు కచ్చితంగా శుభవార్తను వింటారని ఆయన తెలిపారు.