వివేకానందుడి సందేశాన్ని ప్రపంచం ఆమోదించి ఉంటే 9/11 దాడులు జరిగుండేవి కావు: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • 128 ఏళ్ల కిందట అమెరికాలో వివేకానందుడి ప్రసంగం
  • ఇదే రోజున షికాగోలో సభకు హాజరైన వివేకానందుడు
  • ఇదే రోజున అమెరికాలో ఉగ్రదాడులు
  • ఈ అంశాన్ని నేడు ప్రస్తావించిన రామ్ నాథ్ కోవింద్
ఉగ్రవాదం ఎంత భయంకరమైనదో 9/11 దాడులతో యావత్ ప్రపంచానికి అర్థమైంది. నేడు సెప్టెంబరు 11 కాగా, నాడు అమెరికాలో జరిగిన ఉగ్రదాడులపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, 1893 సెప్టెంబరు 11న స్వామి వివేకానందుడు అద్భుతమైన శాంతి సందేశాన్ని వెలువరించారని, ఆ సందేశాన్ని ప్రపంచం పాటించి ఉంటే అమెరికాలో 9/11 దాడులు జరిగుండేవి కావని అభిప్రాయపడ్డారు.

"128 ఏళ్ల కిందట ఇదే రోజున షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు భారతీయ మత, తాత్విక చింతనలను ప్రపంచానికి చాటిచెప్పారు. న్యాయం, సహానుభూతి, సహకారం ఆధారంగా భారత సంస్కృతి పరిఢవిల్లుతోందని సోదాహరణంగా చూపించారు. 1983 నాటి ఆ విలువైన సందేశాన్ని ప్రపంచం గుర్తించి ఉంటే అమెరికాలో మానవత్వంపై జరిగిన భీకర ఉగ్రదాడులకు సాక్షీభూతంగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు" అని రామ్ నాథ్ కోవింద్ వివరించారు.


More Telugu News