మనం మౌనంగా ఉంటున్నాం కాబట్టే టీడీపీ రెచ్చిపోతోంది: వైసీపీ కార్యకర్తలతో తమ్మినేని సీతారాం
- శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని పర్యటన
- వైసీపీ కార్యకర్తలతో సమావేశం
- సీఎం జగన్ కు మద్దతుగా నిలబడాలని వ్యాఖ్య
- మోసగాళ్లంటూ టీడీపీ నేతలపై విమర్శలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ కార్యకర్తలు మౌనం వీడాలని పిలుపునిచ్చారు. మనం మౌనంగా ఉంటున్నాం కాబట్టే టీడీపీ వాళ్లు రెచ్చిపోతున్నారు అని వ్యాఖ్యానించారు. 'సీఎం జగన్ కు మనం మద్దతు ఇవ్వకపోతే టీడీపీ మరింత పేట్రేగిపోతుంది, మనం ఇంకా బలహీనులం అవుతాం' అని వివరించారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు బదులివ్వడానికి వైసీపీలో ఓ సామాన్య కార్యకర్త చాలని అన్నారు.
"ధరలు పెరిగాయంటూ మాపై ఏడవడం ఎందుకు? జంటగా ఇంట్లో ఉంటున్నారు కదా... వెళ్లి కేంద్రాన్ని అడగండి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "మీది దేవతల పాలనా... వెయ్యికి పైగా హామీలు ఇచ్చి ఏనాడైనా నెరవేర్చారా... వంచక పాలకులుగా మిగిలిపోయారు" అని టీడీపీ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు.