రేపు దేశవ్యాప్తంగా 'నీట్'... అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష
- తెలుగు రాష్ట్రాల్లో 'నీట్' రాస్తున్న లక్షమంది విద్యార్థులు
- పెన్ను, పేపరు విధానంలో పరీక్ష
- నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
జాతీయస్థాయి వైద్య విద్య కోర్సుల ప్రవేశ పరీక్ష 'నీట్'ను రేపు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాల వరకు ఏపీలో 9, తెలంగాణలో 7 నగరాల్లో 151 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్ష మంది విద్యార్థులు 'నీట్' రాస్తున్నారు.
పెన్ను, పేపరు విధానంలో ఈ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. పరీక్ష కేంద్రంలో అడ్మిట్ కార్డు, ఫొటో, ఐడెంటిటీ కార్డు మాత్రమే అనుమతిస్తారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు తప్పనిసరి చేశారు. చిన్న శానిటైజర్ సీసాను విద్యార్థి తనతోపాటు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించనున్నారు.
పరీక్ష కేంద్రంలోకి వాటర్ బాటిల్, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు ధరించి వచ్చేందుకు అనుమతి లేదు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీయే) వెల్లడించింది.