సీఎం కేసీఆర్ కు అనంతపురం జిల్లా కరవు పరిస్థితులు తెలియనివా?: పరిటాల సునీత
- ఉమ్మడి రాష్ట్రంలో 'అనంతపురం' ఇన్చార్జి మంత్రిగా కేసీఆర్
- గుర్తుచేసిన పరిటాల సునీత
- జిల్లా కరవు పరిస్థితులు గుర్తించాలని విజ్ఞప్తి
- సీఎం జగన్ మౌనం వీడాలని డిమాండ్
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. నీటి కేటాయింపుల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనంతపురం జిల్లా కరవు పరిస్థితులను గుర్తెరిగి వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా అనంతపురం పరిస్థితులు కేసీఆర్ కు తెలియనివా? అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అనంతపురం జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించారని సునీత గుర్తుచేశారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏపీ సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని పరిటాల సునీత ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ ప్రాజెక్టుల అంశంలో తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏపీ సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని పరిటాల సునీత ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ ప్రాజెక్టుల అంశంలో తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.