సింహాచలం ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు
- సింహాద్రి అప్పన్న క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు
- ఆలయ ఈవో సూర్యకళకు ఐఎస్ఓ సర్టిఫికెట్ అందించిన అవంతి
- కేంద్ర ప్రసాదం కింద ఆలయానికి రూ.53 కోట్లు
- త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్న ఈవో
విశాఖ జిల్లాలో కొలువుదీరిన సింహాచలం పుణ్యక్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన సింహాద్రి అప్పన్న ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు దక్కింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పరిసరాల పచ్చదనం తదితర అంశాల విషయంలో ఈ విశిష్ట గుర్తింపు నిచ్చారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ ఐఎస్ఓ ధ్రువపత్రాన్ని సింహాచల ఆలయ ఈవో సూర్యకళకు అందించారు. అటు, కేంద్ర ప్రసాదం కింద సింహాచల క్షేత్రానికి రూ.53 కోట్లు కేటాయించారు. త్వరలోనే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆలయ ఈవో సూర్యకళ పేర్కొన్నారు.