'సీఎం' అంటే... 'చేపలు', 'మాంసం' అమ్మడం కాదు: అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు

  • మటన్ మార్ట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం
  • విమర్శనాస్త్రాలు సంధించిన అయ్యన్న
  • వేలాది కుటుంబాలు రోడ్డునపడతాయని వెల్లడి
  • "సిగ్గుండాలి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం మటన్ మార్ట్ లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. సీఎం అంటే చేపలు, మాంసం అమ్మడం కాదు... ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అని హితవు పలికారు. ఇప్పటివరకు ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు మటన్ మార్ట్ లు తదితర నిర్ణయాల వల్ల రోడ్డున పడతాయని తెలిపారు. అటు, సినిమా పరిశ్రమను నాశనం చేయడానికే ప్రభుత్వం టికెట్ల అమ్మకం నిర్ణయం తీసుకుందని అయ్యన్న ఆరోపించారు.

"ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా ఏవేవో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలేదు. తుగ్లక్ అనేది ఇందుకే!

నీకేమన్నా పిచ్చిపట్టిందా? ఓ ముఖ్యమంత్రివి అయ్యుండి బ్రాందీ, ఇసుక అమ్ముకుంటావా? గనులను దోచుకుంటావా? భూములను ఆక్రమించుకుంటావా? ఇప్పుడు మాంసం, చేపలు, చికెన్ అమ్ముకుంటావా? సిగ్గుండక్కర్లేదా? నీకు సిగ్గులేకపోయినా నాకు సిగ్గుగా ఉంది. ఇంకా, సినిమా టికెట్లు అమ్ముకుంటావా? ఏ పనికిమాలిన వెధవ నీకు ఇలాంటి సలహాలు ఇస్తున్నాడు?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


More Telugu News