పూణే గణపతికి రూ.6 కోట్ల విలువైన స్వర్ణ కిరీటం

  • పూణేలో ప్రాచీన వినాయక ఆలయం
  • పసిడి కిరీటాన్ని సమర్పించిన భక్తులు
  • 5 కిలోల బంగారంతో తయారైన కిరీటం
  • ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కిరీటం
దేశంలో వినాయకచవితి కోలాహలం నెలకొంది. నేడు వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, మహారాష్ట్రలోని పూణే నగరంలో శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి వినాయక ఆలయాలు ఎంతో ప్రాచీనమైనవి. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు.

తాజాగా, ఇక్కడి వినాయకుడికి భక్తులు బాగా ఖరీదైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ స్వర్ణ కిరీటం ఖరీదు రూ.6 కోట్లు. 5 కిలోల బంగారంతో దీన్ని రూపొందించారు. శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణేశ్ ఆలయంలో ఈ పసిడి కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగ మెరుస్తున్న ఇక్కడి వినాయకుడ్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.


More Telugu News