ఏ పండుగకు లేని ఆంక్షలు వినాయకచవితికే ఎందుకు?: అశోక్ గజపతిరాజు
- కరోనా ఆంక్షలు అన్నింటికీ ఒకేలా ఉండాలని వ్యాఖ్య
- అన్ని మతాలను గౌరవించాలని హితవు
- దొంగలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని వ్యాఖ్యలు
- ప్రభుత్వంలో పారదర్శకత లేదని విమర్శలు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తాజా పరిణామాలపై స్పందించారు. ఏ పండుగకు లేని ఆంక్షలు వినాయకచవితికే ఎందుకని ప్రశ్నించారు. కరోనా ఆంక్షలు అన్నింటికి ఒకే విధంగా ఉండాలని అన్నారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతోందని, ఆ ప్రకారమే నడుచుకోవాలని పేర్కొన్నారు. అందరినీ సమానంగా చూడడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
కోర్టు ఆదేశాలు లేకపోతే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టేవారో! అని అశోక్ వ్యాఖ్యానించారు. దొంగలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచనందుకే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకత లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ జీవోలను కూడా ప్రజలకు అందుబాటులో పెట్టడంలేదని ఆరోపించారు.