ప్రతి ఒక్క మతాన్ని, మత విశ్వాసాలను ప్రభుత్వాలు గౌరవించాలి: చంద్రబాబు
- హైదరాబాదు ఎన్టీఆర్ భవన్ లో గణేశ్ పూజలు
- హాజరైన చంద్రబాబు
- మత విషయాల్లో ప్రభుత్వాల జోక్యం కూడదని హితవు
నేడు వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మతాలు, మత విశ్వాసాల అంశంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని, ప్రజల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ప్రవర్తించాలని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడే శాంతి, సౌభాగ్యం వర్ధిల్లుతాయని అన్నారు.
హైదరాబాదులో వినాయక ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఏ పాలకులు వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క మతాన్నీ, మత విశ్వాసాలను ప్రభుత్వాలు గౌరవించాలని, అది రాజ్యాంగ పరమైన హక్కు అని చంద్రబాబు ఉద్ఘాటించారు.