పిల్లల్ని కనడానికే మహిళలు... ప్రభుత్వంలో వారికి స్థానం లేదు: తాలిబన్ల స్పష్టీకరణ
- తాలిబన్ల నిజస్వరూపం బట్టబయలు
- మహిళలపై తమ వైఖరి వెల్లడించిన తాలిబన్లు
- మంత్రి పదవులు వారికి మోయలేని భారమని కామెంట్
- పిల్లల్ని కంటే చాలని వ్యాఖ్యలు
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను ఆక్రమించిన సమయంలో తాము మారామని చెప్పుకున్న తాలిబన్లు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలపై తమ ఛాందసవాదంలో ఎలాంటి మార్పులేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్ జక్రుల్లా హషీమీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో మహిళలు ఎప్పటికీ స్థానం దక్కించుకోలేరని, మంత్రి పదవులు వారికి పెనుభారం అవుతాయని హషీమీ అభిప్రాయపడ్డారు. ఆ భారాన్ని మోసే బదులు వారు పిల్లలకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. బిడ్డలను కని వారిని ఇస్లామిక్ విలువలకు అనుగుణంగా పెంచడం వారి విధి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ లో నిరసనలు తెలుపుతున్న మహిళలు ఆఫ్ఘన్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆఫ్ఘన్ మహిళలైతే ఆ విధంగా వీధులకెక్కి ప్రదర్శనలు చేపట్టబోరని వ్యాఖ్యానించారు.