వెరైటీగా.. నీటిలో పెళ్లి చేసుకున్న జంట.. వీడియో ఇదిగో
- ఇంగ్లండ్‌లో ఘటన
- స్కూబా డైవింగ్ ను ఇష్టపడే యువతి, యువకుడు
- నీటిలో పెళ్లి చేసుకుని ప్రపంచానికి తెలిసేలా చేసిన జంట
సాధారణంగా ఎవరైనా సరే పంక్షన్ హాళ్లలోనో, మైదానాల్లోనో, ఇతర ఖాళీ స్థలాల్లోనో పెళ్లి చేసుకుంటారు. కొందరు వెరైటీగా ఉంటుందని, తమ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకోవాలని విమానంలోనో, పడవల్లోనో పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి నీటిలోపల పెళ్లి చేసుకుంది ఓ జంట. యూకేలో చోటు చేసుకున్న ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇలా యూకేలో నీటిలోపల పెళ్లి చేసుకున్న మొదటి జంట ఇదేనంటున్నారు కొందరు. స్కూబా డైవింగ్ అంటే ఈ జంటకు చాలా ఇష్టం. దానిపై తమకు ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నారు. ఇంగ్లండలోని బర్మింగ్‌హామ్ లోని మార్స్టన్ గ్రీన్ లో ఉండే బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్ లోని వారు ఈ విధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.