ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధం: ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం

  • మూడు రోజుల క్రితం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు
  • పూర్తి స్థాయి ప్రభుత్వ కూర్పుపై దృష్టి
  • తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు ఆమోదయోగ్యం కాదన్న ఎంబసీ
గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మూడు రోజుల క్రితం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు హాజరు కావాల్సిందిగా పలు దేశాలను ఆహ్వానించనున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. తాలిబన్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడిన ప్రభుత్వం చట్టబద్ధమైనది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ’ పేర్కొంది. తాలిబన్లు కేబినెట్‌ను ఏర్పాటు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఇది పూర్తిగా వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేసింది.

 కాగా, తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన ఆయన ప్రభుత్వ అభిప్రాయంగానే చెబుతున్నారు.


More Telugu News