సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మరో వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన సమంత
- శంకర్ సినిమాలో హాస్య నటుడు సునీల్
- మరో తెలుగు సినిమాకి ధనుష్ గ్రీన్ సిగ్నల్
* ఇటీవల తొలిసారిగా 'ఫ్యామిలీ మేన్ 2' వెబ్ సీరీస్ లో నటించి పేరుతెచ్చుకున్న కథానాయిక సమంత తాజాగా మరో వెబ్ సీరీస్ కి ఓకే చెప్పింది. దీనికి కూడా రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం దీనిని నిర్మిస్తున్నారు.
* రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పాత్రను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేశాడట.
* ప్రముఖ తమిళ హీరో ధనుష్ కథానాయకుడుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంచితే, ఇది ఇంకా సెట్స్ కి వెళ్లకముందే ధనుష్ మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'మహా సముద్రం' చిత్రాన్ని రూపొందిస్తున్న అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.