నారా లోకేశ్ ను ఉండవల్లిలోని నివాసానికి తరలించిన పోలీసులు
- ఇటీవల హత్యకు గురైన అనూష
- నరసరావుపేట వచ్చేందుకు ప్రయత్నించిన లోకేశ్
- గన్నవరంలో అడ్డుకున్న పోలీసులు
- లోకేశ్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు
ఇటీవల గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకు గురికాగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యక్రమాలకు అంగీకరించబోమని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో నారా లోకేశ్ ను ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. అంతకుముందు లోకేశ్ కు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. అటు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ తో సమావేశమయ్యారు. లోకేశ్ పర్యటనను అడ్డుకోవడం, ఇతర పరిణామాలపై ఆమె సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. మహిళల భద్రత, అత్యాచార ఘటనల్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్టు సమాచారం.