ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

  • మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు
  • అక్టోబర్ 4న ఎన్నికల నిర్వహణ
  • అదే రోజున పుదుచ్చేరి శాసనమండలికి కూడా ఎలెక్షన్
ఐదు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 4న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఇదే రోజున పుదుచ్చేరి శాసనమండలి స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది.

 దేశంలోని పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని ఈసీ తీసుకుంది. అనంతరం బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల్లో ఉపఎన్నికలను వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధంగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ ప్రకటించింది.


More Telugu News