ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మటన్ మార్ట్ ల ఏర్పాటు!
- తొలి దశలో విజయవాడ, విశాఖల్లో మటన్ మార్ట్ లు
- మొత్తం 112 మార్ట్ లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- ఆరోగ్యకరమైన మాంసం వినియోగాన్ని పెంచడమే లక్ష్యం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్ట్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నాలుగు చొప్పున మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మార్ట్ లను విస్తరించనున్నారు. మొత్తం రూ. 11.20 కోట్లతో 112 మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు.
ఆరోగ్యకరమైన మాంసం వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా మార్ట్ లను ఏర్పాటు చేస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో మాంసం విక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మద్యం షాపులను నేరుగా నిర్వహిస్తోంది. ఇప్పుడు మాంసం విక్రయాల్లోకి అడుగులు వేస్తోంది.