సూర్య సినిమా బడ్జెట్ 200 కోట్లు?
- జల్లికట్టు నేపథ్యంలో సాగే కథ
- ప్రత్యేక శిక్షణ తీసుకున్న సూర్య
- తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం
- కథానాయికగా ఆండ్రియా ఎంపిక
తమిళనాట కమల్ .. విక్రమ్ తరువాత వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడిగా సూర్య కనిపిస్తాడు. కొత్తదనం కోసం ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. వెరైటీ చూపడం కోసం తెరపై ఎలా కనిపించడానికైనా వెనుకాడడు. అలాంటి సూర్య తాజా చిత్రంగా 'వాడి వాసల్' రూపొందుతోంది.
కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళనాట జరిగే జల్లికట్టు క్రీడ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇందుకోసం సూర్య ప్రత్యేక శిక్షణ తీసుకున్న తరువాతనే షూటింగును మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సూర్య కెరియర్లో ఈ స్థాయి బడ్జెట్ తో రూపొందుతున్న తొలి సినిమా ఇదేనని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండటం మరో విశేషం. ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా ఆండ్రియాను ఎంపిక చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.