గరిటె పట్టిన పంజాబ్ సీఎం.. ఒలింపిక్ వీరులకు వండి వడ్డించిన ముఖ్యమంత్రి
- మొహాలీలోని తన ఫామ్‌హౌస్‌లో విందు ఏర్పాటు
- నీరజ్ చోప్రా సహా పలువురు హాజరు
- ఘుమఘుమలాడే వంటకాలతో అదరగొట్టిన అమరీందర్
- క్రీడాకారుల కష్టం ముందు తన కష్టం చాలా తక్కువన్న సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వండివార్చారు. అతిథులకు స్వయంగా వడ్డించారు. ఆయనకు అంత సమయం కూడా ఉందా? అని ఆశ్చర్యపోకండి. నిజంగా ఆయన గరిటె పట్టుకున్నారు. ఒలింపిక్స్‌లో పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహించి, పతకాలు సాధించిన అథ్లెట్ల కోసం మొహాలీలోని తన ఫామ్‌హౌస్‌లో అమరీందర్ సింగ్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాతోపాటు ఆ రాష్ట్రానికి చెందిన పురుష, మహిళా హాకీ ప్లేయర్లు, ఇతర అథ్లెట్లు పాల్గొన్నారు.
ఉదయం 11 గంటలకు వంట మొదలుపెడితే సాయంత్రం 5 గంటలకు పూర్తయిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వంట చేసిన ప్రతి నిమిషాన్నీ తాను ఆస్వాదించానని పేర్కొన్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేందుకు క్రీడాకారులు ఎంతగానో శ్రమిస్తారని, వారి ముందు తన కష్టం చాలా తక్కువని అన్నారు. కాగా, అమరీందర్ చేసిన వంటకాల్లో మటన్ మసాలా, చికెన్, ఆలూ కూర్మా, కోడి కూర్మా, బిర్యానీ, జర్దా రైస్ (స్వీటు) వంటి వంటకాలు ఉండడం విశేషం. వంట పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా వారికి వడ్డించారు కూడా.