ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పామును ఎలా పట్టేశాడో చూడండి!
- స్కూటీలో నుంచి బయటకు వచ్చిన పాము
- చాకచక్యంగా వాటర్ టిన్‌లో పట్టేసిన వ్యక్తి
- వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద
ఒక స్కూటీలో నుంచి బుస్సుమంటూ తల బయటపెట్టిన పాము వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఆ పాము ఒక్కటే కాదు. దాన్ని ఒక వ్యక్తి పట్టుకున్న విధానం. ఈ పామును కోబ్రాగా నెటిజన్లు గుర్తించారు. ఈ వీడియోలో సదరు వ్యక్తి వాటర్ టిన్‌తో ఆ పామును పట్టేశాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు.
అయితే ఇది ఏడాదిగా ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో క్లిప్‌లో.. ఒక స్కూటీలో నుంచి పాము బయటకు వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో పాము అతన్ని కాటు వేయడానికి ప్రయత్నించింది. చటుక్కున తప్పించుకున్న ఆ వ్యక్తి.. ఆ తర్వాత వాటర్ టిన్‌లోకి పామును చాకచక్యంగా పంపాడు.
పాము పూర్తిగా టిన్‌లోకి వెళ్లగానే దానిపై మూత వేసి మూసేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత.. ‘‘వర్షాకాలంలో ఇలాంటి అతిథులు సహజమే, కానీ దాన్ని పట్టుకున్న విధానం అసహజం. దీన్ని ఎప్పుడూ ప్రయత్నించకండి’’ అని హెచ్చరించారు.
స్కూటీ నంబర్ ప్లేట్‌ను బట్టి ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లు భావిస్తున్నారు. నెటిజన్లు ఈ వీడియోపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కొంతమంది ఇది భయంకరంగా ఉందని చెప్పగా.. మరికొందరు ఆ పాముకు వాటర్ టిన్నులో ఊపిరందుతుందా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి సదరు వీడియోలోని వ్యక్తి తనకు పరిచయం ఉన్నాడని, అతను ఎన్నో పాములను ఇలా కాపాడాడని వెల్లడించాడు.