వచ్చేనెల మొదటి వారంలో 'లవ్ స్టోరీ'?
- శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథ
- కరోనా కారణంగా విడుదలలో జాప్యం
- రీసెంట్ గా మరోసారి వాయిదా
- ఈ సారి పక్కా అంటూ టాక్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకి, పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. 'సారంగధరియా' పాట ఏ రేంజ్ లో దూసుకుపోయిందో తెలిసిందే.
ఇక ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన విడుదలను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ వచ్చేనెల ఫస్టువీక్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
గతంలో శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ దేవయాని కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.