ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు
- 2020-21 ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడి
- మొత్తం హాజరైన వారి సంఖ్య 1,75,868
- 1,34,205 మంది ఉత్తీర్ణత
- ఈనెల 14న అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు విడుదల చేశారు. 2020-21 ఈఏపీసెట్ కు మొత్తం 2,59,688 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1,75,868. వారిలో 1,34,205 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈఏపీసెట్ నిర్వహించామని వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరైన వారిలో ఐదుగురికి మాత్రమే కరోనా సోకిందని తెలిపారు. సంబంధిత వెబ్ సైట్లో రేపటి నుంచి ఇంజినీరింగ్ విభాగం ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంటాయని, ఈ నెల 18న తొలి విడత కౌన్సిలింగ్ ఉంటుందని వెల్లడించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో పరీక్షలు నిన్నటివరకు జరిగినందున, వాటి ఫలితాలు ఈనెల 14న విడుదల చేస్తామని చెప్పారు.